భారీ లాభాలతో క్లోజైన నిఫ్టి

భారీ లాభాలతో క్లోజైన నిఫ్టి

నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతారని, అందుకు అనుగుణంగా ఎల్లుండి ఎగ్జిట్‌ పోల్స్‌ వస్తాయని మార్కెట్‌ భావిస్తున్నట్లు కన్పిస్తోంది. లేదా వ్యాల్యూయేషన్‌ ఉన్నందున... ఎవరొచ్చినా పరవాలేదనే మార్కెట్‌ భావిస్తున్నట్లు కన్పిస్తోంది. నిఫ్టి ఇవాళ అనూహ్యంగా 150 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టి ఇవాళ కేవలం నాలుగు పాయింట్ల లాభంతో 11261 వద్ద ప్రారంభమైంది. ఉదయం నుంచి చాలా గట్టి మద్దతు అందడంతో నిఫ్టి ఒకదశలో 11426 స్థాయిని దాటింది. చివర్లో కాస్త ఒత్తిడి రావడంతో 11407 వద్ద నిఫ్టి ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 537 పాయింట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెటుల ప్రతికూలంగా ఉన్నా... మార్కెట్‌ మే 23 ఫలితాలను ఇప్పటి నుంచే  డిస్కౌంట్‌ చేస్తున్నట్లు కన్పిస్తోంది.

నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 8 శాతం లాభపడగా, బజాజ్‌ పైనాన్స్‌ 6 శాతం పెరిగింది. వీటితో పాటు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, మారుతీ, హీరోమోటోకార్ప్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప లూజర్స్‌లో డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐఓసీ, వేదాంత, హిందాల్కొ ఉన్నాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గెయినర్స్‌లో చంబల్‌ ఫర్టిలైజర్స్‌ ఫలిప్‌ కార్బన్‌, వెంకీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా గ్లోబలర్‌ బ్రేవరేజస్‌ ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో డెల్టా కార్ప్‌, ఐఈఎక్స్‌, అరబిందో ఫార్మా, బ్లూడార్ట్‌, పీసీ జ్యువల్లర్స్‌ ఉన్నాయి.