భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

ఎన్డీఏ గెలుపు జోష్‌ మార్కెట్‌లో కొనసాగుతోంది. ఇవాళ కూడా నిఫ్టి రికార్దు స్థాయిలో 81 పాయింట్లు లాభపడి 11924 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 248 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో క్లోజ్‌ కాగా, యూరో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నయాయి.ఇవాళ బ్రిటన్‌, అమెరికా మార్కెట్లకు సెలవు. ఈ నెల డెరివేటివ్స్‌ ఈ గురువారం అంటే మోడీ మళ్ళీ ప్రమాస్వీకారం రోజున ముగుస్తుంది. అప్పటి వరకు అప్‌ ట్రెండ్‌ కొనసాగుతుందనే వార్తలతో మార్కెట్‌లో షార్ట్‌ కవరింగ్‌ జరుగుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా స్టీల్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐఓసీ,  ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. 
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినరస్‌గా నిలిచిన షేర్లు... అవంతీ ఫీడ్స్‌, నవకార్‌ కార్పొరేషన్, అశోకా బిల్డ్‌ కాన్‌, ఈ ఐ హోటల్స్‌, బాంబే డెయింగ్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్ల షేర్లలో టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... మన్‌పసంద్‌ ఇండస్ట్రీస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, దివీస్‌ ల్యాబ్‌, అస్ట్రా జెనెకా, పీజీ జ్యువెల్లర్స్‌ ఉన్నాయి.