భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

మే డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్‌ లాభాల్లోనే కొనసాగింది. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియడంతో మన మార్కెట్లు మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు లాభాలతో ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ప్రారంభం కావడంతో నిఫ్టి మరింత బలపడింది. క్లోజింగ్‌కల్లా నిఫ్టి 85 పాయింట్ల లాభంతో 11945 పాయింట్ల వద్ద క్లోజ్‌ కాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 329 పాయింట్లు లాభపడింది. ముడి చమురు ధరలు తగ్గినట్లే తగ్గి... పెరగడంతో ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి స్థిరంగా ట్రేడవుతోంది.

నిఫ్టి ప్రధాన షేర్లలో ఎన్‌టీపీసీ, ఎస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ టాప్‌ గెయినర్స్‌గా  ఉన్నాయి.  ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు సన్‌ ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ ఉన్నాయి. 
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో జస్ట్‌ డయల్‌, సుజ్లాన్‌, అదానీ పవర్‌, మారుతీ, ఇన్ఫీబీమ్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్‌లో టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... మన్‌పసంద్‌ ఇండస్ట్రీస్‌, నవభారత్‌ వెంచర్స్‌, జీఎన్‌ఎఫ్‌సీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఉన్నాయి.