స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టి

స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టి

అధికస్థాయిలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి స్వల్ప లాభాలకే పరిమితమైంది. ఒకదశలో 12,000 స్థాయిని క్రాస్‌ చేసినా... అదే స్థాయిలో నిలబడలేకపోయింది. నిన్న రాత్రి అమెరికా, ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లు భారీ లాభాలు గడించిన నేపథ్యంలో మన మార్కెట్ల స్వల్ప లాభాలతో మొదలై.. మిడ్‌ సెషన్‌ వరకు భారీ లాభాలకు చేరింది., 11904 స్థాయికి పడిన నిఫ్టి.. 12000లకు చేరినా.. క్లోజింగ్‌కల్లా 11965కి పరిమితమైంది.  ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి కాస్త బలపడింది. బ్యాంకింగ్‌ షేర్లు మద్దతుగా ఉండటం నిఫ్టికి బాగా కలిసి వచ్చింది. సూచీలు పెరుగుతున్నా... చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగానే ఉంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ ఎస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్ లూజర్స్‌ గా నిలిచిన షేర్లు... ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ టాప్‌ గెయినర్స్‌ జాబితాలో డిష్‌ టీవీ టాప్‌లో ఉంది. ఈ షేర్‌ 12 శాతం పెరిగి రూ. 30కి చేరింది. స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌, పీసీ జ్యువల్లర్స్‌, జైన్‌ ఇరిగేషన్స్‌, నవకార్‌ కార్పొరేషన్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లోని షేర్లు... జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండియా బుల్స్‌ లిమిటెడ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌.