స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

నిన్న భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఇవాళ స్థిరంగా ముగిశాయి. ఉదయం భారీగా నష్టపోయినా... మిడ్‌ సెషన్‌ తరవాత కోలుకుని దాదాపు క్రితం ముగింపు వద్దనే ముగిశాయి. ఉదయం 27 పాయింట్ల నష్టంతో 11531 వద్ద నిఫ్టి ప్రారంభమైంది. తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 11461 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. తరవాత కోలుకుని 11582 పాయింట్లకు అంటే 24 పాయింట్లు లాభపడినా... పై స్థాయిలో నిలబడలేకపోయింది.  క్రితం ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల నష్టంతో 11555 వద్ద నిఫ్టి ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఫెడ్‌ వడ్డీ రేట్లను అరశాతం తగ్గించదనే వార్తలతో రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ సెషన్‌ సమయంలో ఆరంభమైన యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. జర్మనీ డాక్స్‌ ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐఓసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ముగిశాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఉన్న షేర్లు టైటాన్‌, యూపీఎల్‌, టీసీఎస్‌, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు ఉన్నాయి. టీసీఎస్‌ ఇవాళ ఫలితాలను ప్రకటించనుంది. టైటాన్‌ వ్యాపారం క్షీణిస్తుందంటే వివిధ బ్రోకింగ్‌ సంస్థలు అంటున్నాయి.