నిస్తేజంగా ముగిసిన నిఫ్టి

నిస్తేజంగా ముగిసిన నిఫ్టి

ఎగువ స్థాయిలో మద్దతు అందకపోవడంతో నిఫ్టి నష్టాలతో ముగిసింది. చైనా మినహా మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ నష్టాలతో ముగిశాయి. యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. దేశీయంగా పెద్ద ఉత్తేజకర అంశాలు లేకపోవడం, అంతర్జాతీయంగా పరిస్థితి నిరాశాజనకంగా ఉండటంతో నిఫ్టి 10700 దిగువన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి  38 పాయింట్ల నష్టంతో 10679 పాయింట్ల వద్ద ముగిసింది. రియాల్టి, ఐటీ సూచీలు భారీగా నష్టపోయాయి. బ్యాంకులు గ్రీన్‌లో ఉన్నా పెద్దగా లాభాలు లేవు. నిఫ్టి ప్రధాన షేర్లలో సన్‌ ఫార్మా 3.6 శాతం లాభం పొందగా, ఇన్‌ ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల్లో ముగిశాయి. ఇక నష్టపోయి నిఫ్టి షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌ అగ్రభాగాన ఉంది. ఈషేర్‌ ఏకంగా 8 శాతం నష్టపోయింది.యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్, కొటక్‌ మహీంద్రా షేర్లు కూడా ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.