లాభాల్లో ముగిసిన నిఫ్టి

లాభాల్లో ముగిసిన నిఫ్టి

బడ్జెట్‌కు సానుకూలంగా స్పందించిన మార్కెట్‌కు అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి 11,000 దరిదాపుల్లోకి రాగానే భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చి...నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. ఏకంగా 140 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరి గంటలో.. అంటే దిగువస్థాయిలో మద్దతు అందడం, షార్ట్‌ కవరింగ్‌ కారణంగా నిఫ్టి 63 పాయింట్ల లాభంతో 10893 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 212 పాయింట్లు పెరిగింది. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంచుతున్నట్లు మంత్రి పీయూష్‌ గోయాల్‌ ప్రకటించే వరకు మార్కెట్‌ ఒక మోస్తరు లాభాలతో నడిచింది. తరవాత ఊపందుకుని 10983 స్థాయికి చేరింది. కాని అమ్మకాల ఒత్తిడి కారణంగా 10813కి పడిపోయింది. ప్రభుత్వ వ్యయం గతి తప్పుతోందన్న ఆందోళనతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చెబుతున్న స్థాయిలో ఆదాయం ఉండకపోవచ్చని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఫలితాల కారణంగా అనేక షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఎస్‌బీఐ రూ.9పైగా నష్టపోయింది. నిన్న ట్రేడింగ్‌ తరవాత ఫలితాలు ప్రకటించిన వేదాంత ఇవాళ 20 శాతం క్షీణించిన వేదాంత షేర్‌ చివర్లో 18 శాతం నష్టంతో రూ. 161.60 వద్ద ముగిసింది.  నిఫ్టిలో 34 షేర్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో హీరోమోటోకార్ప్‌ రికార్డు స్థాయిలో ఏడున్నర శాతం పెరగ్గా, నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది నాలుగు శాతంపైనే. తరవాతి స్థానాల్లో ఉన్న హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐషర్‌ మోటార్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో వేదాంత 18 శాతం నష్టంతో క్లోజ్‌ కాగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవాళ మరో 7.7 శాతం క్షీణించింది. ఎస్‌ బ్యాంక్‌ అయిదు శాతం, ఎస్‌బీఐ 3.7 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ మూడు శాతం క్షీణించాయి. దీవాన్‌ హౌసింగ్‌ షేర్లు 18 శాతం నష్టంతో ముగిశాయి.