స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తున్నా... మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే ఒక పాయింట్‌ తగ్గి 10,948 వద్ద ముగిసింది. అయితే నిఫ్టి షేర్లలో భారీ ఒత్తిడి రాకున్నా.. ఇతర షేర్లలో అమ్మకాలు సాగాయి. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్ షేర్లు అరశాతం దాకా నష్టపోయాయి.  ఐటీ షేర్ల సూచీ రెండు శాతం పెరగ్గా, ఇతన సూచీలన్నీ నష్టాలతో ముగిశాయి.  అమెరికా చైనాల మధ్య తాజా వాణిజ్య వివాదంతో మెటల్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది.  ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ రెండు శాతం క్షీణించింది. నిఫ్టి షేర్లలో అద్భుత ఫలితాలు సాధించిన టీసీఎస్‌ షేర్‌ 5 శాతం వరకు పెరగ్గా, ఇన్‌ఫ్రా టెల్‌ మూడు శాతం, బజాజ్‌ ఆటో రెండున్నర శాతం చొప్పున పెరిగాయి. హిందుస్థాన్‌ లీవర్‌, రిలయన్స్‌ షేర్లు మరో ఒక శాతం పెరిగాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో యూపీఎల్‌ ఏకంగా అయిదున్నర శాతం పడిపోయింది. కోల్‌ ఇండియా కూడా అయిదు శాతం క్షీణించగా, హిందాల్కో, వేదాంత, టాటా మోటార్స్‌ మూడు శాతం వరకు పడ్డాయి.  ఇవాళ చాలా చురుగ్గా ట్రేడైన ఐడీబీఐ బ్యాంక్‌ అయిదు శాతం లాభపడింది.  ఇక అదానీ గ్రూప్‌లో అదానీ పవర్‌ 18 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.5 శాతం చొప్పున పెరిగాయి.