ఒకేరోజు 1400 పాయింట్ల జోష్

ఒకేరోజు 1400 పాయింట్ల జోష్

సునాయసంగా మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాయన్న ఎగ్జిట్‌ పోల్స్‌తో మార్కెట్‌ పండుగ చేసుకుంది. నిఫ్టి షేర్లలో కేవలం అయిదు మాత్రమే ఇతర కారణాల వల్ల క్షీణించడం వినా... మొత్తం షేర్లన్నీ భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఇటీవల ఇన్వెస్టర్లను భయభాంత్రులు చేసిన మిడ్‌ క్యాప్‌ షేర్లు ఇవాళ సూపర్‌ డూపర్‌ లాభాలు గడించాయి. ఒకే ఒక్క సెషన్‌లో సెన్సెక్స్‌ 1400పాయింట్లకు పైగా లాభపడిందంటే... కొనుగోళ్ళ జోరు ఎలా ఉందో చెప్పొచ్చు. బ్యాంక్‌ ఇండెక్స్‌లోని అన్ని షేర్లూ దూసకుపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు ల సూచీ ఏకంగా 8 శాతం పెరిగింది. నిఫ్టి ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా నిఫ్టి 240 పాయింట్ల లాభంతో 11651 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. వెంటనే ఓ 60 పాయింట్లు తగ్గినా... అక్కడి నుంచి మార్కెట్‌ పరుగులు ఆగలేదు. నిఫ్టి ఒకదశలో 11845ని కూడా తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 421 పాయింట్లు  పెరిగి 11828 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 1421 పాయింట్ల లాభంతో 39352 పాయింట్ల వద్ద క్లోజైంది. నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా కేవలం అయిదు షేర్లు మాత్రమే ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆర్‌ పవర్‌, టైమ్‌ టెక్నో, జమ్నా ఆటో, జీఈ టీ అండ్‌ డీ షేర్లు ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఉన్న షేర్లు ఇవి... డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, కోక్స్‌ అండ్‌ కింగ్స్‌, జ్యూబ్లియంట్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆస్ట్రాజెన్‌