12,000 మార్క్‌ దాటిన నిఫ్టి.. 40,000 దాటిన సెన్సెక్స్‌..

12,000 మార్క్‌ దాటిన నిఫ్టి.. 40,000 దాటిన సెన్సెక్స్‌..

ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమని... ట్రెండ్స్ వస్తుండటంతో స్టాక్‌ మార్కెట్‌ పరుగులు తీస్తోంది. తాజా సమాచారం అందే సమయానికి నిఫ్టి 12,032 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 293 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌ 985 పాయింట్లు పెరిగి 40,097 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్‌, ఎస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ షేర్లు ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హిందాల్కో, వేదాంత, విప్రో, ఐటీసీ షేర్లు ఉన్నాయి.