నిఫ్టిః న‌ష్టాల‌తో ఆరంభం

నిఫ్టిః న‌ష్టాల‌తో ఆరంభం

అధిక స్థాయిల వ‌ద్ద అమ్మ‌కాల ఒత్తిడి కార‌ణంగా నిఫ్టి న‌ష్టాల‌తో ప్రారంభమైంది. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగియ‌డం, ఇవాళ వ‌చ్చిన చైనా డేటా నిరుత్సాహ‌క‌రంగా ఉండ‌టంతో ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్ల‌లో కూడా అదే ట్రెండ్ కొన‌సాగుతోంది. ఐటీ మిన‌హా మిగిలిన కౌంట‌ర్ల‌న్నీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ప్ర‌ధానంగా ఫార్మా కౌంట‌ర్ల‌లో లాభాల స్వీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఈ రంగానికి చెందిన షేర్లు బాగా పెరిగాయి. ఇవాళ ఈ సూచీ రెండు శాతంపైగా న‌ష్టంతో ట్రేడ‌వుతోంది.అలాగే పీఎస్‌యూ బ్యాంకులు, రియాల్టీ షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మ‌హీంద్రా, ఏషియ‌న్ పెయింట్స్‌, హిందుస్థాన్ లీవ‌ర్ షేర్లు వెలుగులో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న షేర్ల‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, స‌న్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, లుపిన్‌, టాటా మోటార్స్ ఉన్నాయి.