మళ్ళీ 11,700పైన ముగిసిన నిఫ్టి

మళ్ళీ 11,700పైన ముగిసిన నిఫ్టి

తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్‌... చివర్లో లాభాలతో ముగిసింది. ఆరంభంలో 40 పాయింట్లకు పైగా లాభంతో 11711 వద్ద ప్రారంభమైన నిఫ్టి ఒకదశలో 11655 పాయింట్లకు పడిపోయింది. మిడ్‌ సెషన్‌లో కోలుకున్న నిఫ్టి అక్కడి నుంచి 11729కి చేరింది.  చివరి నిమిషాల్లో వచ్చిన ఒత్తిడికి 11,713 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా మార్కెట్‌ లాభాల్లో ముగియడం విశేషం. రుణాల బాకీపై సుప్రీం కోర్టు తీర్పుతో స్తబ్దుగా మారిన బ్యాంక్‌ షేర్లు చివర్లో ఊపందుకున్నాయి. అయితే ఆసియా మార్కెట్లలో నిన్నటి ఉత్సాహం లేదు. స్వల్ప లాభానికే పరిమితమయ్యాయి. యూరో మార్కెట్లలో కూడా పెద్ద ఉత్సాహం లేదు. దీంతో నిఫ్టి కూడా పరిమిత లాభాలకే పరిమితమైంది. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌  మోటార్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌... జీ ఎంటర్‌టైన్‌మెంట్, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, సన్‌ ఫార్మా. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌... సుజ్లాన్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, టాటా మోటార్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఉన్నాయి. సెన్సెక్స్ టాప్‌ లూజర్స్‌లో సియంట్‌, ఐడియా, ఆర్‌ కామ్‌, ఎన్‌బీసీసీ, దీపక్‌ ఫర్టిలైజర్స్‌ ఉన్నాయి.