చివర్లో కొనుగోళ్ళతో ఆగిన నిఫ్టి పతనం

చివర్లో కొనుగోళ్ళతో ఆగిన నిఫ్టి పతనం

రోజంతా తీవ్రస్థాయిలో ఒడుదుడుకులకు లోనైంది నిఫ్టి. నష్టాల్లో మొదలైన కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి చేరిన నిఫ్టి మిడ్ సెషన్‌ వరకు డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. ట్రేడింగ్‌ చివరి గంటలో భారీ మద్దతు అందింది. మిడ్‌ సెషన్‌లో నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 10,583కి పడిపోయింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉండటంతో  నిఫ్టి భారీగా కోలుకుంది. ఒకదశలో 10,690కి చేరిన నిఫ్టి కేవలం 9 పాయింట్ల నష్టంతో 10,652 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 64 పాయింట్లు క్షీణించింది. నిఫ్టిలో 19 షేర్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా 31 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్‌ ఇవాళ ఆరు శాతం లాభంతో ముగిసింది. ఉదయం నష్టాల్లో ఉన్న బజాజ్‌ ఫైనాన్స్‌ తరవాత కోలుకుని 4.45 శాతం లాభంతో ముగిసింది. బజాజ్‌ ఫిన్ సర్వ్‌ కూడా నాలుగు శాతం పెరిగింది. ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఐషర్‌ మోటార్స్‌ ఆరు శాతం క్షీణించింది. గెయిల్‌ రెండున్నర, ఎల్‌ అంట్‌ టీ ఒకటిన్నర శాతం నష్టంతో ముగిశాయి. హెచ్‌పీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ సేర్లు కూడా ఒక శాతంపైగా నష్టంతో క్లోజ్‌ అయ్యాయి. చురుగ్గా ట్రేడవుతున్న షేర్లలో డిష్‌ టీవీ మళ్ళీ 9 శాతం నష్టపోగా, దీవాన్‌ హౌసింగ్‌ ఏడు శాతం తగ్గింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.6 శాతం లాభంతో ముగిసింది.