భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఏప్రిల్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ భారీ నష్టాలతో ముగిసింది. ఉదయం నుంచి ఒక మోస్తరు లాభాలతో ట్రేడైన నిఫ్టి ఉదయం 11796 పాయింట్లకు పెరిగినా.. తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడితో 11641 వద్ద ముగిసింది. నిఫ్టి 84 పాయింట్లు, సెన్సెక్స్‌ 323 పాయింట్లు క్షీణించాయి. ఉదయం ఆసియా మార్కెట్లు (జపాన్‌ మినహా) ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. తరవాత మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. డెరివేటివ్స్‌ కారణంగా ఆప్షన్స్‌, ఫ్యూచర్స్‌లో భారీ ట్రేడింగ్‌ జరిగింది. నిఫ్టి ప్రధాన షేర్లలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌ కంపెనీలు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఒక టాప్‌ లూజర్స్‌లో జాబితాలో వరుసగా ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, వేదాంత, మారుతీ, హిందాల్కో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్‌... ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, వాక్రంగీ, ఓరియంట్‌ సిమెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిం ముందున్నాయి. టాప్‌ లూజర్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌ (పీపీ) ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఆర్‌ కామ్‌, జాగ్రన్‌ ప్రకాశన్‌ ముందున్నాయి.