భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నీరసంగా ఉన్నా... మన మార్కెట్లలో కొత్త సిరీస్‌ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ మొదలయ్యాయి. నిఫ్టి ఆరంభంలో స్వల్ప లాభాలకే పరిమితమైనా... ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ నిఫ్టి బలపడింది. 11683 వద్ద ప్రారంభమైన నిఫ్టి ఒకదశలో 11661కి పడినా... కొనుగోళ్ళ మద్దతు కారణంగా 11762కి చేరింది. చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని 112 పాయింట్ల లాభంతో 11754 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ  సెన్సెక్స్‌ 336 పాయింట్లు పెరిగింది. ముడి చమురు ధరలు భారీగా క్షీణించడంతో పాటు ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్న కౌంటర్లకు గట్టి మద్దతు లభించింది. నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌ జాబితాలో టాటా మోటార్స్‌, గ్రాసిం, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఉన్నాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో టాప్‌ గెయినర్స్‌... టాటా స్టీల్‌ (పీపీ), ఎంఈజీహెచ్‌, జీహెచ్‌సీఎల్‌, ఏపీఎల్‌ లిమిటెడ్‌తో పాటు టాటా స్టీల్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్... ఆర్‌ పవర్‌, పీసీ జ్యువల్లర్స్‌, పీఈఎల్‌, 3ఎం ఇండియా, ర్యాలీస్‌ ఇండియా ఉన్నాయి.