నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఎగ్జిట్‌ ఫలితాల జోష్‌ అనూహ్యంగా దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా లాభాలు ఆర్జించిన మార్కెట్‌ ఇవాళ స్వల్ప విరామం తీసుకుంది. ఉదయం నుంచి కాస్త అటూ ఇటూగా కదలాడిన మార్కెట్‌ ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగింది. ఉదయం ఆరంభంలో ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయి 11883 గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి తరవాత అమ్మకాల ఒత్తిడి కారణంగా 11682 పాయింట్లకు క్షీణించినా... చివర్లలో షార్ట్‌ కవరింగ్‌ కారణంగా స్వల్పంగా పెరిగి 11709 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 119 పాయింట్లు, సెన్సెక్స్‌ 382 పాయింట్లు క్షీణించింది. చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించడంతో నిన్నంతా అన్ని టెక్నాలజీ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఇవాళ అమెరికా సదరు ఆంక్షలను సడలించడంతో... ఆసియా మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలు 64 డాలర్లకు చేరువ అవుతున్నాయి. దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిన్న భారీగా క్షీణించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇవాళ మూడు శాతం పెరిగింది. ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, బ్రిటానియా, రిలయన్స్‌ షేర్లు ఇవాళ నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా ఉన్న షేర్లు... టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌. 
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌.... జెట్‌ ఎయిర్‌వేస్, మహా లాగ్‌, జస్ట్‌ డయల్‌, ఎడల్‌వైజ్‌, జ్యోతి ల్యాబ్స్‌.
సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌... ఆస్ట్రాల్‌, టాటా మోటార్స్‌, ఫిలిప్స్‌ కార్బన్‌, టాటా మోటార్స్‌ (డీవీఆర్‌) డిష్‌ టీవీ