స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

ట్రేడింగ్‌ రోజంతా తీవ్ర ఒడుదుడుకులతో సాగింది. ఉదయం స్వల్ప నష్టంతో 11725 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఒకదశలో 11789 గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి తరవాత అమ్మకాల ఒత్తిడి కారణంగా 11699కి క్షీణించింది. మిడ్‌ సెషన్‌లో కాస్త కోలుకుని మళ్ళీ 11780కి చేరినా... ఆస్థాయిలో నిలబడలేకపోయింది. క్లోజింగ్‌లో 23 పాయింట్ల నష్టంతో 11724 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 50 పాయింట్లు క్షీణించింది. చైనా, జపాన్‌ మార్కెట్లకు సెలవు కావడంతో ఆసియా మార్కెట్లు డల్‌గా సాగాయి. హాంగ్‌సెంగ్‌ ఒక్కటే ఒక మోస్తరు లాభంతో ముగిసింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనా.. వెంటనే లాభాల్లోకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల్లో పతనం కొనసాగుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 72 డాలర్ల దిగువకు వచ్చింది. డాలర్‌తో రూపాయి ఇవాళ 20 పైసలు బలపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, హీరో మోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో బ్రిటానియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ముందున్నాయి. జెట్‌ ఎయిర్‌ వేస్‌ 12 శాతం క్షీణించగా, ఆర్‌ పవర్‌ 11 శాతం తగ్గింది. 
బీఎస్‌ఇ సెన్సెక్స్ షేర్లలో టాప్‌ గెయినర్స్‌... టాటా స్టీల్‌ (పీపీ) శారదా కార్పొరేషన్‌, అజంతా ఫార్మా, కెన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌, డీసీఎం శ్రీరామ్‌
సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌... జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌ పవర్‌, ఎస్కార్ట్స్‌, డీబీఎల్‌, మిందా ఇండస్ట్రీస్‌.