మార్కెట్‌.. చివర్లో లాభాల స్వీకరణ

మార్కెట్‌.. చివర్లో లాభాల స్వీకరణ

ఉదయం నుంచి మార్కెట్‌కు మద్దతు లభించింది. స్వల్ప లాభాలతో ఆరంభమైన నిఫ్టికి ఇన్వెస్టర్ల నుంచి మద్దతు అందడంతో ఒకదశలో 10766 స్థాయిని తాకింది. చివర్లో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడంతో నిఫ్టి 10741 వద్ద ముగిసింది. ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు నష్టాలతో ముగిశాయి. మిగిలిన అన్ని రంగాల సూచీల్లో పెద్ద మార్పులు లేవు. ఎంపిక చేసిన షేర్ల చుట్టూ మార్కెట్‌ తిరిగింది. నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్‌ 3 శాతం దాకా లాభపడింది. టైటాన్‌, టాటా స్టీల్‌ కూడా ఒక మోస్తరు లాభంతో ముగిశాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో అల్ర్టాటెక్‌ సిమెంట్‌ 2.4 శాతం క్షీణించింది. బీపీసీఎల్‌, లుపిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈలో ఫస్ట్‌ సోర్స్‌ సొల్యూషన్స్ 12 శాతం లాభపడగా, సింటెక్స్‌ 8శాతం పెరిగింది.