భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు స్పందించాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కట్లు కూడా ఒక స్థాయి నుంచి భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి క్లోజింగ్‌ కల్లా 89 పాయింట్ల నష్టంతో 10,710 వద్ద ముగిసింది. నిఫ్టికి తొలి ప్రధాన మద్దతు స్థాయి 10,700 అని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇవాళ అన్ని రంగాల సూచీలు నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా రియాల్టి, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు రెండు శాతం దాకా నష్టపోయాయి. ఇవాళ లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్, గెయిల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌ ఉన్నాయి. ఇవన్నీ స్వల్ప లాభాలతో ముగిశాయి. నష్టపోయిన షేర్లలో వేదాంత, ఐఓసీ, హెచ్‌ఫీసీఎల్‌ షేర్లు మూడు శాతం పైగా నష్టపోగా, యూపీఎల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా రెండు శాతంపైగా నష్టపోయాయి.