10,800 ఎగువన ముగిసిన నిఫ్టి

10,800 ఎగువన ముగిసిన నిఫ్టి

ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టి సెషన్‌ కొనసాగేకొద్దీ  బలం పుంజకుంది. ఉదయం  ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ట్రంప్‌, కిమ్‌ మధ్య చర్చలు ఫలవంతమైనా... యూరో మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. చాలా మార్కెట్లు రెడ్‌లో ఉన్నాయి. మన మార్కెట్లు మార్కెత్‌ మిడ్‌ సెషన్‌ తరవాత కూడా పటిష్ఠంగా ముగిశాయి. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 56 పాయింట్లు లాభపడి 10,842 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్‌, ఫార్మా, ఐటీ కౌంటర్లలో భారీ మద్దతు అందింది. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా భారీగా లబ్ది పొందాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో లుపిన్‌ ఆరున్నరశాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ అయిదు శాతంపైగా లాభపడ్డాయి.ఎస్‌బీఐ కూడా దాదాపు నాలుగు శాతం లాభంతో ముగిసింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ లీవర్‌ రెండున్నర శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌ టెల్‌ రెండు శాతం నష్టపోగా, హిందాల్కో, టాటా స్టీల్‌, ఐషర్‌ మోటార్స్ ఒకటిన్నర శాతం నష్టోయాయి.  ఇక బీఎస్‌ఇలో ఎంఎటీసీ 14 శాతం లాభపడింది.