భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో నిఫ్టి 62 పాయింట్లు లాభపడింది. ఉదయం నుంచి ఆసియా, మధ్యాహ్నం నుంచి యూరో మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. యూరో మార్కెట్లలో కాస్త అయోమయం కన్పించినా భారత మార్కెట్లు లాభాలతో ముగియడం విశేషం. ప్రైవేట్‌ బ్యాంకులు, మెటల్‌, రియాల్టి షేర్ల సూచీలు ఒక శాతంపైగా పెరిగాయి. నిఫ్టి షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, వేదాంత రెండు శాతం దాకా లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన సేర్లలో యమూపీఎల్‌ మూడు శాతం తగ్గింది. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షర్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.