నష్టాలతో ముగిసిన నిఫ్టి 

నష్టాలతో ముగిసిన నిఫ్టి 

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కన్పించింది. ఉదయం నుంచి అన్ని మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్వల్ప నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌ నాటికి భారీగా క్షీణించినా.. తరవాత కోలుకుంది. ముగింపు సమయానికి 48 పాయింట్ల నష్టంతో 10,808 వద్ద ముగిసింది. ఫార్మా, ఆటో మినహా మిగిలిన రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి షేర్లలో లుపిన్‌ మూడున్నర శాతం పెరగ్గా, సన్‌ ఫార్మా మరో రెండున్నర శాతం లాభం పొందింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, ఎస్‌ బ్యాంక్‌ ఒకటి నుంచి రెండు శాతం వరకు లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో  టెక్‌ మహీంద్రా ముందుంది. ఈ షేర్‌తో పాటు అదానీ పోర్ట్స్, టీసీఎస్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఐఓసీ షేరలు రెండు శాతం నష్టాలతో ముగిశాయి.