నిలకడగా ముగిసిన నిఫ్టి

నిలకడగా ముగిసిన నిఫ్టి

ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ నిలకడగా ముగిసింది. దాదాపు క్రితం ముగింపు స్థాయి 10,767 వద్దే నిఫ్టి క్లోజైంది. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లలో వచ్చిన ఆకస్మిక ర్యాలీతో నిఫ్టి నష్టాలను పూడ్చుకుంది. ఫార్మా సూచీ నాలుగు శాతం పైగా పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ కూడా ఒక శాతం లాభపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో సన్‌ ఫార్మా షేర్‌ 8 శాతం లాభపడగా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు 5 శాతం పెరగ్గా సిప్లా మూడు శాతం లాభపడింది. గెయిల్‌ రెండు శాతం పెరిగింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌ షేర్లు రెండున్నర శాతం నష్టాలతో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం నష్టపోయాయి.