స్థిరంగా ఓపెనైన స్టాక్ మార్కెట్‌

స్థిరంగా ఓపెనైన స్టాక్ మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉండ‌టంతో  మ‌న మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు పూర్తవుతుంది. నిన్న షార్ట్ క‌వ‌రింగ్‌తో భారీగా పెరిగిన షేర్లు ఇప్పుడు ముందుకు సాగ‌లేక‌...స్థిరంగా ఉన్నాయి. సెషన్ కొన‌సాగే కొద్దీ అమ్మకాల ఒత్తిడిని మార్కెట్ ఎంత వ‌ర‌కు త‌ట్టుకుంటుందో చూడాలి. రాత్రి అమెరికా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే తీరు. న‌ష్టాలు భారీగా లేక‌పోవ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. నిఫ్టి ప్రస్తుతం 20 పాయింట్ల లాభంతో 11,747 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు రాత్రి స్వల్పంగా క్షీణించ‌డం మార్కెట్ అనుకూల అంశ‌మైనా... డెరివేటివ్స్ క్లోజింగ్ కార‌ణంగా... ఇప్పుడు కేవ‌లం రోల్ఓవ‌ర్స్‌ పైనే మార్కెట్ దృష్టి ఉంది. నిఫ్టి ప్రధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్ జాబితాలో ఎస్ బ్యాంక్‌, గ్రాసిం, అల్ట్రాటెక్ సిమెంట్‌, బీపీసీఎల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కంపెనీలు ముందున్నాయి. ఇక నిఫ్టి టాప్ లూజ‌ర్స్ షేర్ల‌లో  ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, మారుతీ, బ‌జాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.