నిఫ్టి మ‌ళ్ళీ కొత్త రికార్డు

నిఫ్టి మ‌ళ్ళీ కొత్త రికార్డు

అంత‌ర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నా మ‌న మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డు నెల‌కొల్పుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో క్లోజ్‌కాగా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. మ‌న మార్కెట్లు మాత్రం భారీ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. కంపెనీ రిఫైన‌రీలో వాటాను సౌదీ అరేబియా కంపెనీ ఆరామ్ కోకు  అమ్ముతున్నార‌న్న వార్త‌తో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ 3 శాతం వ‌ర‌కు లాభంతో ట్రేడ‌వుతోంది. ఇలాంటి వార్త‌ల‌పై కూడా కంపెనీ నో కామెంట్ అని స‌మాధానం ఇవ్వ‌డంతో మార్కెట్‌లో వ‌దంతులు వీర విహారం చేస్తున్నాయి. చైనాలో ఆటో మార్కెట్ మెరుగుప‌డుతోంద‌న్న వార్త‌ల‌తో టాటా మోటార్స్ ఇవాళ కూడా పెరిగింది. 69 పాయింట్ల లాభంతో నిఫ్టి ప్రారంభ‌మైంది. 11800పైన ఒత్తిడి తీవ్రంగా ఉండ‌టంతో 11856 నుంచి స్వల్పంగా త‌గ్గి 11820 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, టాటా మోటార్స్‌, విప్రో, ఏషియ‌న్ పెయింట్స్‌,  హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచారు. నిఫ్టి టాప్ లూజ‌ర్స్‌లో హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, వేదాంత‌, టాటా స్టీల్‌, భార‌తీ ఎయిర్ టెల్ ఉన్నాయి.  జెట్ ఎయిర్స్ 10 శాతం క్షీణించింది. ఈ కౌంట‌ర్‌లో కొనుగోలుదారులు ఎవ‌రూ లేరు. బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయిన‌ర్స్‌... స్పైస్ జెట్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, ఎంఎఫ్ఎస్ఎల్‌, దీప‌క్ ఫ‌ర్టిలైజ‌ర్స్‌, గృహ్ ఫైనాన్స్‌. సెన్సెక్స్ టాప్ లూప‌ర్స్‌... జెట్ ఎయిర్‌వేస్‌, టాటా స్టీల్ (పీపీ) రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, ప్రిస్టేజ్‌, ఆర్‌కామ్‌.