ఏడో రోజూ నిఫ్టికి నష్టాలు

ఏడో రోజూ నిఫ్టికి నష్టాలు

అంతర్జాతీయ మార్కెట్ల టెన్షన్ల నుంచి మన మార్కెట్లు తప్పించుకోలేకపోతున్నాయి. వారాంతాన ఆసియా మార్కెట్లు ముఖ్యంగా ఆసియా మార్కెట్లు లాభాలతో ముగిసినా.. యూరో మార్కెట్లు లాభాల్లో ఉన్న మన మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. ఏ స్థాయిలోనూ మార్కెట్‌కు ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి మద్దతు అందలేదు. నిఫ్టి ఇవాళ 13 పాయింట్ల లాభంతో 11314 వద్ద నిఫ్టి ప్రారంభమైనా... తరవాత ఒకదశలో 11251కి పడిపోయింది. యూరో మార్కెట్ల ఓపెనైన తరవాత నిఫ్టి 11345 స్థాయికి చేరినా... తరవాత 11,278 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి స్థిరంగా ట్రేడైంది. చైనా వస్తువులపై సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే చర్చలు కొనసాగుతున్నాయిని... సానుకూల నిర్ణయం రాగలదనే ధీమాతో ఉంది చైనా. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐఓసీ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.