రికార్డు లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

రికార్డు లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

అంత‌ర్జాతీయ మార్కెట్ల సానుకూల‌త‌, వ‌డ్డీ రేట్ల‌ను ఆర్బీఐ త‌గ్గిస్తుంద‌న్న ధీమాతో మార్కెట్ ప‌రుగులు తీస్తోంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 11690 వ‌ద్ద 69 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. చైనా డేటా సానుకూలంగా రావ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. ఫారెక్స్ మార్కెట్‌కు సెల‌వు కావ‌డంతో పాటు ఇవాళ క్లియ‌రింగ్ హాలిడే కావ‌డం మార్కెట్‌కు క‌ల‌సి వ‌చ్చింది. శుక్ర‌వారం షేర్ల‌ను కొనుగోలు చేసిన‌వారు ఇవాళ అమ్మే ఛాన్స్ లేక‌పోవ‌డంతో మార్కెట్‌లో ఉత్సహం పెరిగింది. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు లాభాల‌తో ముగియ‌గా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ రెండు శాతంపైగా పెరిగింది.చైనా, హాంగ్‌సెంగ్‌లు కూడా లాభాల్లో ఉన్నాయి. మ‌రోవైపు ప‌ర‌ప‌తి విధానం స‌మీక్షించి... వ‌డ్డీ రేట్ల‌ను క‌నీసం పావు శాతం ఆర్బీఐ త‌గ్గిస్తుంద‌న్న ధీమా మార్కెట్‌లో క‌న్పిస్తోంది. దీంతో బ్యాంకు షేర్ల‌లో కొనుగోళ్ళ ఆసక్తి క‌న్పిస్తోంది. అయితే మార్కెట్ గ‌రిష్ఠ స్ఘాయిల్లో ట్రేడ్ అవుతుండ‌టంతో సాదార‌ణ ఇన్వెస్ట‌ర్లు పొజిష‌న్స్ తీసుకోవ‌డానికి జంకుతున్నారు. అయినా.. ఫండ్ల మద్ద‌తుతో నిఫ్టి ప‌రుగులు తీస్తోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో వేదాంత‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, గెయిల్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి టాప్ లూజ‌ర్స్ జాబితాలో ఐఓసీ, సిప్లా, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐష‌ర్ మోటార్స్ ఉన్నాయి.  ఇక బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయిన‌ర్‌గా ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ నిలిచింది. ఈ షేర్ ప‌ది శాతం పెరిగి రూ. 77.55 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. టాటా స్టీల్ (పీపీ) వెల్ కార్ప్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఇండియా సిమెంట్ టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో ఎస్ఆర్ఎఫ్‌, న‌వ‌భార‌త్ వెంచ‌ర్స్‌, సెరా, ఐడియా, ఐఓసీ షేర్లు ఉన్నాయి.