భారీ న‌ష్టాలతో ప్రారంభ‌మైన‌ స్టాక్ మార్కెట్‌

భారీ న‌ష్టాలతో ప్రారంభ‌మైన‌ స్టాక్ మార్కెట్‌

అంత‌ర్జాతీయంగా అన్ని స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. గ‌త శుక్ర‌వారం యూరో, అమెరికా మార్కెట్లు ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో ప్రారంభ‌మైనా... ఇవాళ ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ న‌ష్టాలతో ట్రేడ‌వుతున్నాయి. అమెరికా ట‌ర్కీకి చెందిన మెట‌ల్స్ పై భారీ ఎత్తున సుంకం వేయ‌డంతో ఆ దేశ క‌రెన్సీలిరా భారీగా న‌ష్ట‌పోయింది. దీని ప్ర‌భావం ఇత‌ర దేశాల మార్కెట్ల‌పై ప‌డుతోంది. ఇప్ప‌టికే ఇరాన్ వ్య‌వ‌హారంతో టెన్ష‌న్ లో ఉన్న ఇన్వెస్ట‌ర్ల‌కు అమెరికా తాచా చ‌ర్య‌తో ఆందోళ‌న రెట్టిపైంది. ఆసియాలో దాదాపు అన్ని ప్రధాన మార్కెట్లు ఒక శాతంపైగా న‌ష్ట‌పోయాయి. ట్రేడ్ వార్ భ‌యంతో ఆయిల్ కూడా క్షీణించింది. మ‌రోవైపు శాంగ్‌సంగ్ ప‌లితాలు నిరుత్సాహ‌క‌రంగా ఉండ‌టంతో ద‌క్షిణ కొరియా మార్కెట్లో అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. మ‌న మార్కెట్లు ఆరంభంలో భారీగా క్షీణించాయి. నిఫ్టి 80 పాయింట్ల న‌ష్టంతో మొద‌లైంది. ప్ర‌స్తుతం  67 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. ఐటీ త‌ప్ప మిగిలిన ప్ర‌ధాన సూచీల‌న్నీ న‌ష్టాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ ప‌లితాలు నిరుత్సాహ‌క‌రంగా ఉండ‌టంతో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం దాకా న‌ష్ట‌పోయింది. అలాగే మెట‌ల్, ఆటో రంగాల సూచీలు ఒక శాతం దాకా ప‌డిపోయాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టెక్ మ‌హీంద్రా, గెయిల్‌,సిప్లా, కోల్ ఇండియా, విప్రో షేర్లు  లాభాలతో  ట్రేడ‌వుతున్నాయి. ఇక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న షేర్ల‌లో వేదాంత‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్స్ ఉన్నాయి.