నిఫ్టికి ఎగ్జిట్ జోష్‌

నిఫ్టికి ఎగ్జిట్ జోష్‌

ఎగ్జిట్‌పోల్స్‌కు మార్కెట్ చాలా సానుకూలంగా స్పందించింది. ఓపెనింగ్‌లోనే 247 పాయింట్లు లాభ‌ప‌డిన నిఫ్టి ప్ర‌స్తుతం అదే జోష్ తో ట్రేడ‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఆయిల్ బాగా పెరిగినా... మార్కెట్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. దీనికి కార‌ణం డాల‌ర్‌తో రూపాయి ఏకంగా 80 పైస‌లు లాభ‌ప‌డ‌టం. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్‌, అల్ట్రాటెల్ సిమెంట్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. నిఫ్టిలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, బ‌జాజ్ ఆటో, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు టాప్ లూజ‌ర్స్‌లో ఉన్నాయి. ఇవ‌న్నీ ఎగుమ‌తి ప్ర‌ధాన కంపెనీలు. డాల‌ర్‌తో రూపాయి బ‌ల‌ప‌డ‌ట‌మే దీనికి కార‌ణం.