భారీ లాభాలతో నిఫ్టి ఆరంభం

భారీ లాభాలతో నిఫ్టి ఆరంభం

ఎన్నికల ఫలితాల్లో ప్రారంభం ట్రెండ్స్‌ ఎన్డీఏకు అనుకూలంగా ఉండటంతో మార్కెట్‌  దూకుడుగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 11901 స్థాయిని తాకింది. ముడి చమురు ధరలు భారీగా క్షీణించడం కూడా మార్కెట్‌కు ప్లస్‌గా మారింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, గ్రాసిం ఇండస్ట్రీస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో సద్భావ్‌ ఇంజినీరింగ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జేపీ అసోసియేట్స్‌, థర్మాక్స్‌, రెడింగ్టన్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌, గ్రిండ్‌వెల్‌, శారదా కార్పొరేషన్‌, జీఈ టీ అండ్‌ డీ, నాట్కో ఫార్మా ఉన్నాయి.