భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లోఉండ‌టం, డాల‌ర్‌తో రూపాయి స్థిర‌ప‌డ‌టంతో మ‌న స్టాక్ మార్కెట్లు ఆక‌ర్షణీయ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా ఆక‌ర్షణీయంగా ఉన్నాయి. ఒక్క చైనా మార్కెట్లు మాత్రమే స్వల్ప న‌ష్టాల‌తో ఉన్నాయి. మిగిలిన మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు, రియాల్టితో పాటు మెట‌ల్ కౌంట‌ర్ల‌లో కొనుగోలు ఆస‌క్తి క‌న్పిస్తోంది. ఒక్క ఐటీ షేర్లు మాత్ర‌మే నిస్తేజంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం నిఫ్టి 58 పాయింట్ల లాభంతో 11,443 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. లాభాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో వేదాంత‌, గ్రాసిం, హిందాల్కో, ఐటీసీ, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో టెక్ మ‌హీంద్రా ముందుంది. భార‌తీ ఎయిర్ టెల్, గెయిల్, విప్రో, బ‌జాజ్ ఆటో షేర్లు ఉన్నాయి. హెచ్‌డీఐఎల్ 8 శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.