భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండ‌టంతో పాటు రూపాయి బ‌ల‌ప‌డ‌టంతో మ‌న మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభ‌మ‌య్యాయి. నిన్న యూర‌ప్‌, రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతం వ‌ర‌కు లాభాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్క‌ట్లో డాల‌ర్ క్షీణించ‌డంతో పాటు ముడి చమురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గడంతో  రూపాయి బ‌ల‌ప‌డింది. దీంతో ఐటీ షేర్ల‌పై మోజు త‌గ్గింది. ఇత‌ర సూచీలు అన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌న్నీ ఇవాళ టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. నిఫ్టి ప్ర‌స్తుతం 85 పాయింట్ల లాభంతో 1322 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి 43 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి షేర్ల‌లో టాప్ గెయినర్స్ ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐఓసీ, టాటా స్టీల్‌, ఇన్‌ఫ్రా టెల్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ సీఈవో రానా క‌పూర్ ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు ఆర్‌బీఐ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఎస్ బ్యాంక్ షేర్ 28 శాతం క్షీణించి రూ. 230 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. న‌ష్టాల‌తో  ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో ఎస్ బ్యాంక్ త‌ర‌వాత ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్రా, భార‌తీ ఎయిర్‌టెల్‌, జీ ఎంట‌ర్ టైన్‌మెంట్ ఉన్నాయి.