న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉండ‌టంతో పాటు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ధోర‌ణితో మార్కెట్లు నిస్తేజంగా మారాయి. చైనాపై మ‌రిన్ని దిగుమ‌తి సుంకాలు విధిస్తామ‌ని ట్రంప్ చేసిన హెచ్చ‌రిక‌ల‌తో మ‌ళ్ళీ వాణిజ్య యుద్ధ బ‌యాలు క‌మ్ముకుంటున్నాయి. గత శుక్ర‌వారం యూరో మార్కెట్లు నిస్సారంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లు కూడా స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ఇవాళ ఉద‌యం వెలువ‌డిన గ‌ణాంకాలు ప్రోత్సాహ‌క‌క‌రంగా లేక‌పోవ‌డంతో చైనా మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. జ‌పాన్ నిక్కీ వ‌రుస న‌ష్టాల‌కు బ్రేక్ ప‌డింది. లాభాలు పెద్ద‌గా లేకున్నా న‌ష్టాలు లేక‌పోవ‌డం శుభ‌సూచ‌కం. కాని హాంగ్ సెంగ్ మాత్రం ఇవాళ కూడా ఒక‌శాతం వ‌ర‌కు న‌ష్ట‌పోయింది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కూడా నిస్తేజంగా ప్రారంభ‌మ‌య్యాయి. ముఖ్యంగా ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి త‌ప‌నం నిరాటంకంగా సాగుతోంది. ఇవాళ పార్వ‌ర్డ్ మార్కెట్‌లో రూపాయి 44 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డింది. మ‌రోవైపు అమెరికాలో ముడి చ‌మురు డ్రిల్లింగ్ మెషిన్స్ సంఖ్య త‌గ్గ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో  స్వ‌ల్ప న‌ష్టాల‌తో నిఫ్టి ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌స్తుతం 27 పాయింట్ల న‌ష్టంతో 11561 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.ఫార్మా, మీడియా, ఐటీతో పాటు మెట‌ల్ రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి.ప్ర‌స్తుతానికి సూచీల్లో పెద్ద లాభ‌న‌ష్టాల్లేవ్. కొత్త సీఈఓ ఖ‌రారు కావ‌డంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ నాలుగు శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. లుపిన్‌, భార‌తీ ఎయిర్ టెల్, జీ ఎంట‌ర్‌టైన్ మెంట్, సిప్లా షేర్లు లాబాల్లో ట్రేడ‌వుతున్నాయి. ఇక న‌ష్ట‌పోతున్న నిఫ్టి షేర్ల‌లో అల్ట్రాటెక్ ముందుంది. బీపీసీఎల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, హీరో మోటో కార్ప్‌, ఓఎన్‌జీసీ షేర్లు కూడా న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి.