న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను అత‌లాకుతలం చేస్తున్నాయి. చైనాను హెచ్చ‌రిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్‌తో స్టాక్ మార్కెట్‌తోపాటు క‌మాడిటీస్ మార్కెట్లో అమ్మ‌కాల ఒత్తిడి పెరుగుతోంది. గ‌త శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు న‌ష్టాల‌తో క్లోజ్‌కాగా, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ న‌ష్టాల‌తో ట్రేడువుతున్నాయి. ఉద‌యం నిఫ్టి స్వ‌ల్ప న‌ష్టంతో ప్రారంభ‌మైనా.. ఇపుడు 30 పాయింట్ల న‌ష్టంతో 11248 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. విదేశీ ఇన్వెస్ట‌ర్లు క్ర‌మంగా అమ్మ‌కాల‌కు పాల్ప‌డటం అదే స్థాయిలో కొనుగోలు చేసే స్థాయిలో దేశీయ ఆర్థిక సంస్థ‌లు, ఫండ్లు లేక‌పోవ‌డంతో బ్లూచిప్ షేర్ల‌తో పాటు మ‌ధ్య త‌ర‌హా కంపెనీల షేర్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. మ‌రోవైపు మార్కెట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను డిస్కౌంట్ చేసే అవ‌కాశ‌ముంద‌ని మార్కెట్ అన‌లిస్టులు అంటున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా మారితే త‌ప్ప దేశీయ ప‌రిస్థితుల‌తో మార్కెట్ ఇంకా క్షీణించే అవ‌కాశ‌ముంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, టెక్ మ‌హీంద్రా, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. 
టాప్ లూజ‌ర్స్‌: ఐష‌ర్ మోటార్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎల్ అండ్ టీ, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డాక్ట‌ర్‌రెడ్డీస్ ల్యాబ్.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయిన‌ర్స్‌: ఐడియా, మోతిలాల్ ఓస్వాల్‌, ఒబెరాయ్ రియాల్టి, పీఎన్‌బీ హౌసింగ్‌, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌. 
సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌:  డెల్టా కార్పొరేష‌న్‌, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌, టాటా స్టీల్ (పీపీ), సుజ్లాన్‌, వి మార్ట్