లాభాలతో ప్రారంభమైన నిఫ్టి

లాభాలతో ప్రారంభమైన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల బూస్ట్‌తో దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. టాప్ గెయినర్స్‌లో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా... అన్నీ స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. దీంతో నిఫ్టి కూడా స్వల్పంగా అంటే 32 పాయింట్ల లాభంతో 10,650 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అన్ని సూచీలు ఒకటిన్నర శాతంపైగా లాభపడ్డాయి.

ఉదయం నుంచి జపాన్‌ నిక్కీ మినహా మిగిలిన సూచీలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మన దగ్గర లాభాలు పొందిన నిఫ్టి షేర్లలో  కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఇంకా హెచ్ సీఎల్‌ టెక్‌, ఇండియా బుల్‌ హౌసింగ్‌ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. నష్టాలతో ట్రేడవుతున్న నిఫ్టి షేర్లలో హిందుస్థాన్‌ పెట్రో అగ్రస్థానంలో ఉంది. బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.