లాభాలతో మొదలైన నిఫ్టి

లాభాలతో మొదలైన నిఫ్టి

నిన్న యూరో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. భిన్నంగా రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో క్లోజయ్యాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర మార్కెట్ల నష్టాలు నామమాత్రంగా ఉన్నా... జపాన్‌ నిక్కీ మాత్రం ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్‌ స్వల్ప లాభంతో ఆరంభమైంది. టెక్‌ షేర్ల అండ కారణంగా నిఫ్టి 30 పాయింట్ల లాభంతో 10,460 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఒకశాతంపైగా లాభపడ్డాయి. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, సిప్లా, టాటా స్టీల్‌ కూడా లాభాల్లో ఉన్నాయి. భారీ నష్టాలు ప్రకటించిన టాటా మోటార్స్‌ రెండున్నర శాతం క్షీణించింది. కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, వేదాంత, ఏషియన్‌ పెయింట్స్‌ నిఫ్టి లూజర్స్‌లో ముందున్నాయి. ఇక బీఎస్‌ఇలో ఎరోస్‌ మీడియా 8 శాతం లాభం పొందగా, కేపీఐటీ నాలుగు శాతం లాభంతో ట్రేడవుతోంది. స్ట్రయిడ్స్‌ షాసన్‌ వరుసగా మూడో రోజు కూడా 4 శాతం లాభపడింది. నాట్కో ఫార్మా, కావేరీ సీడ్స్‌ 3 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ 7 శాతం క్షీణించింది.