లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

ప్రి ఎల‌క్ష‌న్ ర్యాలీ కొన‌సాగుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు ప్ర‌తికూలంగా ఉన్నా మ‌న మార్కెట్ల‌లో అప్ ట్రెండ్ కొన‌సాగుతోంది. ఓపెనింగ్‌లోనే 38 పాయింట్లు పెరిగిన నిఫ్టి ఇపుడు 8 పాయింట్ల లాభంతో 11,469 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. అధిక‌స్థాయిలో కాస్త ఒత్తిడి వ‌స్తున్న‌ట్లు సంకేతాలు వెలువ‌డుతున్నాయి. గురువారం మార్కెట్‌కు సెల‌వు కావడంతో వారాంత‌పు డెరివేటివ్ కాంట్రాక్ట్స్‌కు రేపే చివ‌రి రోజు. దీంతో బ్యాంక్ నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి క‌న్పిస్తోంది. మ‌రో 500 పాయింట్లు పెరుగుతుంద‌ని టెక్నిక‌ల్ అన‌లిస్టులు అంటున్నా... 30,000పైన  బ్యాంక్ నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి వ‌స్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌కే ప‌రిమితం కావ‌డం, ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు న‌ష్టాల్లో ఉండ‌టంతో... నిఫ్టి మిడ్‌సెష‌న్‌క‌ల్లా న‌ష్టాల్లోకి జారుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, స‌న్ ఫార్మా, గెయిల్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. అయితే లాభాలు ప‌రిమితంగా ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్ జాబితాలో ఐష‌ర్ మోటార్స్‌, హీరో మోటో కార్ప్‌, బ‌జాజ్ ఆటో, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, ఎల్ అండ్ టీ ఉన్నాయి.   ఇత‌ర షేర్ల‌లో ఆర్‌కామ్ 10శాతం సీలింగ్ వ‌ద్ద ట్రేడ‌వుతోంది. అనిల్ అంబానీ కోర్టుకు సొమ్ము క‌ట్ట‌డంతో ఈ షేర్‌లోఅమ్మ‌కం దారులు లేరు. బీఎస్ఈలో ఆర్ కామ్‌తోపాటు జేఎం ఫైనాన్షియ‌ల్‌,మెఘాని ఆర్గానిక్స్, ఏబీ క్యాపిట‌ల్‌, ఎడ‌ల్‌వైసిస్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిల‌వగా, జెట్ ఎయిర్‌వేస్‌, ఐష‌ర్ మోటార్స్‌, టీవీఎస్ మోటార్స్‌, మిందా ఇండ‌స్ట్రీస్ షేర్లు టాప్ లూజ‌ర్స్‌లో ఉన్నాయి.