లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. మార్కెట్‌కు విదేశీ ఇన్వెస్ట‌ర్ల మ‌ద్ద‌తు కొన‌సాగుతోంది. నిన్న మార్చి క్లోజింగ్ రోజు భారీ ఎత్తున షార్ట్ క‌వ‌రింగ్ జ‌రిగింది. ఇవాళ కూడా కీల‌క షేర్ల‌లో కొనుగోళ్ళ మ‌ద్ద‌తు సాగుతోంది. రాత్రి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఒపెక్ దేశాల‌కు హెచ్చ‌రిక‌లాంటిది జారీ చేసినా... చ‌మురు ధ‌ర‌లు ఏమాత్రం త‌గ్గ‌లేదు. మ‌రోవైపు అమెరికా జీడీపీ గణాంకాలు నిరుత్సాహ‌క‌రంగా ఉన్నా... చైనా, అమెరికాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల అంశం మ‌ళ్ళీ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చ‌ర్చ‌లు సానుకూల ఫ‌లితాలు ఇస్తాయ‌నే ఆశ‌తో ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్ల లాభాలు అర శాతం లోపే ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా ఒక మోస్త‌రు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. మాంద్యం భ‌యాల కార‌ణంగా ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌న నిఫ్టి పాజిటివ్‌గా ఓపెనై.. ఇపుడు 51 పాయింట్ల లాభంతో 11620 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. బ్యాంకు షేర్ల‌కు మ‌ద్ద‌తు కొన‌సాగుతోంది. నిఫ్టి టాప్ గెయిన‌ర్స్‌లో జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, వేదాంత‌, ఇండ‌యా బుల్స్ హౌసింగ్‌, ఐఓసీ, ఎస్ బ్యాంక్ ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో ఐష‌ర్ మోటార్స్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఆటో ఉన్నాయి.  ఇత‌ర షేర్ల‌లో ఎస్‌బీఐ లైఫ్ 5 శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతుండ‌గా, ఐడియా షేర్ ఏకంగా 12 శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్‌లో కూడా ఐడియా టాప్ గెయిన‌ర్‌గా ఉంది. త‌రువాతి స్థానాల్లో వాబ్‌కో ఇండియా, టాటా మోటాలిక్స్‌, ఇండియా బుల్స్ లిమిటెడ్‌, టాటా స్టీల్ (పీపీ) ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో ఎస్‌బీఐ లైఫ్‌, ఆర్ కామ్‌, బ‌జాజ్ హోల్డింగ్స్‌, ఇరిస్‌, స్సైస్ జెట్ షేర్లు ఉన్నాయి.