లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా... మ‌న మార్కెట్లు ఒక మోస్త‌రు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టి 62 పాయింట్ల లాభంతో 11660 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నాస్‌డాక్ న‌ష్టాల్లో క్లోజ్ కాగా ఇత‌ర సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. లాభ‌న‌ష్టాల్లో పెద్ద తేడా లేదు. అమెరికా, చైనాల మ‌ధ్య వాణిజ్య చర్చ‌లు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా మిశ్ర‌మంగా ఉన్నాయి. చైనా, జ‌పాన్ మార్కెట్లు గ్రీన్‌లో ఉంటే... హాంగ్‌సెంగ్ రెడ్‌లో ఉంది. ఇత‌ర మార్కెట్ల‌లో పెద్ద మార్పుల్లేవ్? ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు లాభాల్లో మొద‌ల‌య్యాయి. అయితే ఈ లాభాలు చివ‌రి వ‌ర‌కు కొన‌సాగుతాయా అన్న అనుమానం మార్కెట్‌లో పెరుగుతోంది. అధిక స్థాయిల వ‌ద్ద నిఫ్టి బ‌ల‌హీనంగా ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. పైగా బీజేపీ సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ త‌గ్గుతున్న‌ట్లు మార్కెట్ భావిస్తోంది. ఇవాళ రియ‌ల్ ఎస్టేట్ కౌంట‌ర్ల‌లోనే కొనుగోళ్ళ మ‌ద్ద‌తు అందుతోంది. త‌గ్గించిన వ‌డ్డీ రేట్లతో డిమాండ్ పెరుగుతుంద‌నే అంచ‌నాతో కొనుగోళ్ళు వ‌స్తున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, సిప్లా, ఎస్ బ్యాంక్‌, టెక్ మ‌హీంద్రా, టైటాన్... టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో ఏషియ‌న్ పెయింట్స్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, మారుతీ, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, ఐటీసీ ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌లో ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌, గోద్రెజ్ ప్రాప‌ర్టీస్‌, టాటా స్టీల్ (పీపీ) జ్యోతి ల్యాబ్స్‌, పీజే జ్యువ‌ల్ల‌ర్స్ ఉన్నాయి. ఇక లాప్ లూజ‌ర్స్‌లో ఆర్ కామ్‌, శ్రీ‌రామ్ సిటీ, వర్ల్‌పూల్‌, ఓరియంట్ సిమెంట్‌, ఫోర్స్ మోటార్స్ షేర్లు ఉన్నాయి.