లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

మార్కెట్‌కు రోజు రోజుకూ మ‌ద్ద‌తు పెరుగుతోంది. అమెరికా ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌హీనంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో విదేశీ ఇన్వెస్ట‌ర్లు మ‌న మార్కెట్‌లోకి నిధుల‌ను పెంచుతున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో వ‌డ్డీ రే్ట్ల‌ను పెంచ‌డానికి బ‌దులు త‌గ్గించే అవ‌క‌శాలు అధికంగా ఉన్నాయ‌ని ఫెడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ నేప‌త్యంలో ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్ల‌లో ఆందోళ‌న వ్య‌క్త‌మౌతోంది. చైనాలో ఇవాళ వ‌చ్చిన వాణిజ్య డేటా కూడా నిరాశాజ‌న‌కంగా ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్ట‌ర్ల మ‌ద్దతో మ‌న నిఫ్టి ప‌రుగులు తీస్తోంది. నిన్న ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ భారీ లాభాల‌తో ముగిశాయి. అమెరికా సూచీలు దాదాపు ఒక శాతం పెరిగాయి. అయితే ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో మిశ్రమ ధోర‌ణి వ్య‌క్త‌మౌతోంది. జ‌పాన్ నిక్కీ న‌ష్టాల్లో ఉండ‌గా, హాంగ్‌సెంగ్ స్వ‌ల్ప లాభాల్లో ఉంది. నిన్న క్షీణించిన చైనా మార్కెట్లు ఇవాళ ప‌రిమిత లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి ఇపుడు 36 పాయింట్ల లాభంతో 11519 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టిని చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లే కాపాడుతున్నాయి. ఇవాళ నిఫ్టి  ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్స్‌.... ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, ఐఓసీ, ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్ బ్యాంక్ ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌లో... ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, టెక్ మ‌హీంద్రా, ఐష‌ర్ మోటార్స్‌, ఎన్‌టీపీసీ ఉన్నాయి.  ఇత‌ర షేర్ల‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్‌, జెట్ ఎయిర్‌వేస్ నాలుగు శాతం వ‌ర‌కు పెర‌గ్గా, పీఎన్‌బీ రెండు శాతం లాభ‌ప‌డింది.  బీఎస్ఈ సెన్సెక్స్‌లోనూ  ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. త‌రువాతి స్థానాల్లో యూకో బ్యాంక్‌, గోద్రెజ్ ఆగ్రో, ఐనాక్స్ లీజ‌ర్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.  ఇక సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో  ఆర్ కామ్‌, ప్రిస్టేజీ, జూబ్లియంట్‌, ఐడియా, జేపీ అసోసియేట్స్ ఉన్నాయి.