స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న యూరో స్వ‌ల్ప లాభాల‌తో క్లోజ్ కాగా, రాత్రి అమెరికా కూడా అదే స్థాయిలో ముగిసింది. డాల‌ర్ తో పాటు  ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా త‌గ్గాయి.  కాని దిగువ స్థాయి నుంచి రెండూ కోలుకుని నిల‌క‌డ‌గా ట్రేడ‌వుతున్నాయి. ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడ‌వుతోంది. హాంగ్ సెంగ్ స్థిరంగా క్రితం ముగింపు వ‌ద్దే ఉంది. చైనా మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు నిల‌క‌డ‌గా ప్రారంభ‌మ‌య్యాయి. ఐటీ మిన‌హా మిగిలిన రంగాల షేర్లు ఒక మోస్త‌రు లాభ‌న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు నిఫ్టి 10 పాయింట్ల న‌ష్టంతో 11427 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్ఫోసిస్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, స‌న్ ఫార్మా, అదానీ పోర్ట్స్, విప్రో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో  ఐటీసీ, టైటాన్, బ‌జాజ్ ఫైనాన్స్‌, హిందుస్థాన్ లీవ‌ర్, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ ఉన్నాయి.