నిఫ్టి: కొత్త సిరీస్ శుభారంభం

నిఫ్టి: కొత్త సిరీస్ శుభారంభం

జ‌వ‌న‌రి సిరీస్ ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ప్రారంభమైంది. యూరో మార్కెట్లు నిన్న న‌ష్టాల‌తో ముగిసినా... అమెరికా మార్కెట్లు మొన్నటి లాభాల‌ను (ఆరు శాతం) నిలుపుకుంది. రాత్రి అమెరికా సూచీల‌న్నీస్థిరంగా ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు స్త‌బ్దుగా ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు స్థిరంగా, నామ‌మాత్ర‌పు న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. ఇత‌ర సూచీలు ఒక మోస్త‌రు లాభాల‌తో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిన్న డిసెంబ‌ర్ సిరీస్ ముగింపు కార‌ణంగా భారీ లాభాలు పొంద‌డంలో మార్కెట్ విఫ‌లైమంది. మ‌రి ఇవాళ లాభాలను నిలుపు కుంటుందా అన్న‌ది చూడాలి. వ‌చ్చే నెల నుంచి కార్పొరేట్ ఫ‌లితాల రాక ప్రారంభ‌మౌతుంది. కాబట్టి డెరివేటివ్స్ ట్రేడ‌ర్లు ఇప్ప‌టి నుంచి కీల‌క కంపెనీల‌పై క‌న్నేశాయి. నిఫ్టి ప్ర‌స్తుతం 60 పాయింట్ల లాభంతో 10840 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టిలోని 45 షేర్లు లాభాలు ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్ల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టాప్ గెయిన‌ర్‌గా ఎస్ బ్యాంక్ అగ్ర‌స్థానంలో ఉంది. త‌రువాతి స్థానంలో టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, స‌న్ ఫార్మా, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న షేర్ల‌లో కోల్ ఇండియా ముందుంది. త‌రువాతి స్థానాల్లో కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ ఉన్నాయి. ఇత‌ర షేర్ల‌లో చురుగ్గ ట్రేడ‌వుతున్న ఎన్‌బీసీసీ, పీసీ జ్యువ‌ల్ల‌ర్స్‌, హెచ్‌డీఐఎల్ షేర్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి.