భారీ లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

భారీ లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

ప్ర‌పంచ మార్కెట్లు ఉర‌క‌లెత్తుతున్నాయి. మార్కెట్ అంచ‌నాల‌కు మించి కంపెనీలు ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డంతో అన్ని మార్కెట్ల‌లో ఉత్స‌హం  క‌న్పిస్తోంది. నిన్న యూరో మార్కెట్లు కాస్త బ‌ల‌హీనంగా ముగిసినా రాత్రి మార్కెట్లు రెండు శాతంపైగా పెరిగాయి. టెక్‌తో పాటు ఇత‌ర రంగాల షేర్లు ఇదే స్థాయిలో పెరిగాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో ఇదే ట్రెండ్ క‌న్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో మన మార్కెట్లు కూడా భారీ లాభంతో ప్రారంభ‌మైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 100 పాయింట్ల లాభంతో 10700 స్థాయిని దాటింది. ప్ర‌స్తుతం 73 పాయింట్ల లాభంతో 10659 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్ల సూచీలు క‌నీసం ఒక శాతం పెరిగాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ షేర్లు భారీ లాభంతో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి షేర్ల‌లో ఇన్ఫోసిస్‌, ఐష‌ర్ మోటార్స్‌, గెయిల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముందున్నాయి. ఇక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో అయిదే ఉన్నాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హీరో మోటో కార్ప్‌, ఓఎన్‌జీసీ ఉన్నాయి. నిన్న 17 శాతం పెరిగిన సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ ఇవాళ మ‌రో 5 శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.