భారీ లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

భారీ లాభాల‌తో నిఫ్టి ప్రారంభం

సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మోగ‌డం, మోడీ మ‌ళ్ళీ మోడీ గెలుస్తార‌న్న ధీమాతో మార్కెట్ 11100 స్థాయిని దాటింది. అనేక బ్రోకింగ్ కంపెనీ గ‌త కొన్ని రోజులు మోడీ విజ‌యం ఖాయ‌మ‌ని, కొనుగోలు చేయాల్సిందిగా ఇన్వెస్ట‌ర్ల‌కు స‌ల‌హా ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ఉన్నా... మ‌న మార్కెట్ స్థిరంగా ముందుకు సాగుతోంది. శుక్ర‌వారం రాత్రి అమెరికా మార్కెట్లు న‌ష్టాల్లో ముగిసినా... ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. శుక్ర‌వారం దాదాపు మూడు శాతం వ‌ర‌కు క్షీణించిన చైనా మార్కెట్లు ఇపుడు అదే స్థాయిలో లాభాల్లో ఉన్నాయి. నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు కూడా ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 40 పాయింట్లు పెరిగింది. అధిక స్థాయిల్లోనూ  కొనుగోళ్ళ మ‌ద్ద‌తు సాగ‌డంతో ప్ర‌స్తుతం 93 పాయింట్ల లాభంతో 11128 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి  టాప్ గెయిన‌ర్స్‌లో ఐష‌ర్ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌,హీరో మోటోకార్ఫ్,  బీపీసీఎల్‌,  ఓఎన్జీసీ ఉన్నాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌లో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, సిప్లా, టెక్ మ‌హీంద్రా, ఎన్‌టీసీపీ, కొట‌క్ మ‌హీంద్రా ఉన్నాయి. ఇక బీఎస్ఈ టాప్ గెయిన‌ర్స్‌లో డీబీఎల్‌, గుజ‌రాత్ గ్యాస్‌, హెడ‌ల్‌బ‌ర్గ్ 5 శాతం లాభంతో ట్రేడ‌వుతున్నాయి. న‌ష్టాల్లో ఉన్న‌వాటిల్లో బిర్లా కార్ప్,దీవాన్ హౌసింగ్‌,  లెమ‌న్ ట్రీ, ఎన్ఎన్ఎండీసీ ఉన్నాయి.