లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

మార్కెట్‌లో ప్రి ఎల‌క్ష‌న్  ర్యాలీ  కొన‌సాగుతోంది. నిన్న ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ లాభాల్లో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు అర‌శాతంపైగా లాభంతో క్లోజ‌య్యాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.చైనా వృద్ధి రేటు బాగా మంద‌గించ‌డంతో చైనా షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్ గ్రీన్‌లో ఉన్న మాటేగాని.. నామ‌మాత్ర‌పు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు లాభాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. విదేశీ ఇన్వెస్ట‌ర్లు సూచీల‌ను ఆదుకుంటున్నారు. ఈ ఒక్క నెల‌లోనే విదేశీ ఇన్వెస్ట‌ర్లు రూ. 16,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన‌ట్లు లెక్క‌. ప్ర‌ధానంగా సూచీలు,ఆప్ష‌న్స్‌లోనే వీరు ఇన్వెస్ట్ చేశారు. అందుకే లాభాలు కేవ‌లం బ్లూచిప్‌ల‌కు ప‌రిమ‌త‌మౌతున్నాయి. కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన వారపు డెరివేటివ్ కాంట్రాక్ట్ ఇవాళ ముగుస్తాయి. అనూహ్యంగా పెరిగిన బ్యాంక్ నిఫ్టిపైనా ఒత్తిడి పెరుగుతోంది.

నిప్టి ప్ర‌స్తుతం 29 పాయింట్ల లాభంతో 11370 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.  నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎస్ బ్యాంక్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఐఓసీ, ఇన్‌ఫ్రాటెల్ లాభాల్లో ముందున్నాయి. ఇక న‌ష్టాల్లో లూజ‌ర్స్‌గా ఉన్న షేర్ల‌లో  హీరో మోటోకార్ప్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, బ‌జాజ్ ఆటో, బీపీసీఎల్ ఉన్నాయి.  బీఎస్ఈ  షేర్లో రెడింగ్ట‌న్‌, మోతీలాల్ ఓస్వాల్‌, దీవాన్ హౌసింగ్‌, జేఎం ఫైనాన్స్‌, టాటా గ్లోబ‌ల్ 4 నుంచి 4 శాతం లాభంతో ట్రేడ‌వుతున్నాయి.ఇక న‌ష్టాల్లో ఉన్న టాప్ లూజ‌ర్స్‌లో క్వాలిటీ, మ‌న్‌ప‌సంద్‌,  టేక్ సొల్యూష‌న్స్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, కోక్స్ అండ్ కింగ్స్ ఉన్నాయి.