స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లు స్త‌బ్దుగా ఉండ‌టం, ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో మార్కెట్‌పై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం క‌న్పిస్తోంది. నిఫ్టి ఓపెనింగ్‌లో కాస్త క్షీణించినా.. ప్ర‌స్తుతం 11600 ప్రాంతంలో స్థిరంగా ట్రేడ‌వుతోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు ముఖ్యంగా ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారల్‌కు 71 డాల‌ర్ల‌కు చేర‌డంతో మార్కెట్‌లో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో డాల‌ర్‌తో రూపాయి క్షీణిస్తోంది. దీని ప్ర‌భావంతో విదేశీ ఇన్వెస్ట‌ర్లు మార్కెట్ నుంచి నిధులు ఉప‌సంహ‌రించుకుంటున్నారు. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో హెచ్‌సీఎల్ టెక్‌, విప్రో, టెక్  మ‌హీంద్రా, హిందుస్థాన్ లీవ‌ర్‌, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఏషియ‌న్ పెయింట్స్‌, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిం షేర్లు ఉన్నాయి. నిబంధ‌న‌లు ఉల్లంఘించినందున పీవీపీ వెంచ‌ర్స్ షేర్ల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆపేశాయి.