లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా.. మ‌న మార్కెట్లు లాభాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. నిన్న యూరో మార్కెట్లు ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ భిన్నంగా ఉంది. డౌ జోన్స్, ఎస్ అండ్ పీ స్థిరంగా క్లోజ్ కాగా, నాస్ డాక్ ఒక‌శాతంపైగా న‌ష్టంతో ముగిసింది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో కూడా మిశ్ర‌మ ధోర‌ణి క‌న్పిస్తోంది. జ‌పాన్ నిక్కీ, హాంగ్ సెంగ్‌లు న‌ష్టాల్లో ఉండ‌గా, ఇత‌ర మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. చైనాయేత‌ర మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి స్వ‌ల్ప లాభంలో 11500 ప్రాంతంలో ట్రేడ‌వుతోంది.  ఫారెక్స్ మార్కెట్ లోరూపాయికి ఇప్ప‌టికీ మద్ద‌తు అంద‌డం లేదు. రాత్రి డాల‌ర్ తోపాటు ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా క్షీణించాయి. కాని దాని ప్ర‌భావం మ‌న రూపాయిపై క‌న్పించ‌డం లేదు. మీడియా సూచీ మూడున్న‌ర శాతం క్షీణించ‌గా, రియాల్టి రంగ సూచీ ఒక‌టిన్న‌ర శాతం లాభ ప‌డింది. ఇత‌ర సూచీల్లో పెద్ద మార్పుల్లేవ్. ఇక నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, ఇన్ ఫ్రాటెల్, కోల్ ఇండియా, లుపిన్ ఉన్నాయి. ఇక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో జీ ఎంట‌ర్ టైన్‌మెంట్,టెక్ మ‌హీంద్రా, ఇండియా బుల్స్ హౌసింగ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. హ‌డ్కో షేర్ 8 శాతంపైగా లాభ‌ప‌డ‌గా, అర‌బిందో ఫార్మా రెండున్న‌ర శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.