నిఫ్టి ఓపెనింగ్‌ సూపర్‌

నిఫ్టి ఓపెనింగ్‌ సూపర్‌

అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. అమెరికా మార్కెట్‌ రాత్రి స్వల్ప లాభంతో క్లోజ్‌ కాగా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. లాభనష్టాలు పెద్దగా లేవు. అయితే మన మార్కెట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 35 పాయింట్ల లాభంతో 10549 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ బలంగా ఉండటంతో ఐటీ షేర్లలో మద్దతు కొనసాగుతోంది. నిఫ్టి షేర్లలో గెయిల్‌, ఇన్ఫోసిస్‌ 2 శాతం పైగా లాభపడగా.. టీసీఎస్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. మిందాల్కో, ఎస్‌ బ్యాంకులు ఒక శాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో వేదాంత మరో రెండున్నర శాతం కోల్పోయింది. ఓఎన్‌జీసీ 2 శాతం, భారతీ ఎయిర్‌ టెల్‌ ఒక శాతం క్షీణించాయి. విలీన వార్తలతో ఎంసీఎక్స్‌ వెలుగులో ఉంది. బీఎస్‌ఇలో ఈ షేర్‌ ఆరు శాతంపైగా లాభపడింది. జీడీఎల్‌ 10 శాతం, యూబీఎల్‌ ఆరు శాతం లాభపడ్డాయి. గ్రాన్యూయల్స్ ఇండియాలో ఇవాళ కూడా నష్టాలు కొనసాగాయి. ఈ షేర్‌ మరో అయిదున్నర శాతం క్షీణించింది. 

Photo: FileShot