నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి

నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా మన మార్కెట్లు నిస్తేజంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీలు మినహా మిగిలిన సూచీలన్నీ రెడ్‌లో ఉన్నాయి. లాభనష్టాలు నామమాత్రంగా ఉండటంతో నిప్టి 10,600 ప్రాంతంలో నికలడగా ప్రారంభైంది. కాని కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 10,577 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. చైనా వస్తువులపై అమెరికా విధించిన ఆంక్షలకు విరామం ప్రకటించడంతో చైనా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ కూడా అరశాతం లాభంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ సూచీ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. లాభాల్లో ట్రేడవుతున్న నిఫ్టి షేర్లలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ముందుంది. సిమెంట్‌ డీల్‌తో ఈ కంపెనీ 2.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, ఓఎన్ జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, మారుతీ, సన్‌ ఫార్మా, బజాప్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఆటో ఉన్నాయి. ఇక బీఎస్‌ఈలో ఐనాక్స్‌ 8శాతం లాభపడగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4 శాతం లాభంతో ట్రేడవుతోంది.

Photo: FileShot