నిలకడగా నిఫ్టి ప్రారంభం

నిలకడగా నిఫ్టి ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్ లో ఉన్నా లాభాలు పరిమితంగా ఉండటంతో మన దగ్గర సూచీలు నిలకడగా ప్రారంభమయ్యాయి. 10,750 ప్రాంతంలో నిప్టి ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగియడం, ఆసియా మిశ్రమంగా ఉండటంతో ట్రెండ్‌ అస్పష్టంగా ఉంది. ఆసియాలో జపాన్‌ నిక్కీ లాభాల్లో ఉండగా.. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. మన మార్కెట్లలో మెటల్‌ సూచీలు ఒక్కటే నష్టాల్లో ఉంది. ఇతర సూచీలు గ్రీన్‌లో ఉన్నా.. పెద్దగా లాభాలు లేవు. నిఫ్టి ప్రధాన షేర్లలో కోల్‌ ఇండియా, టైటాన్‌లు మాత్రమే ఒక మోస్తరు లాభాలు గడించాయి. పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఇన్‌ఫ్రాటెల్‌ వంటి షేర్ల లాభాలు నామ మాత్రమే. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హిందాల్కో, టాటా స్టీల్‌ రెండు శాతం నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, బీపీసీఎల్‌, లుపిన్‌ షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఈ లో ఆర్‌ కామ్‌ ఆరు శాతం లాభపడగా.. గ్రాన్యూయల్స్ ఇండియా, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ 6 శాతం లాభపడ్డాయి.